నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
జెండా వద్ద అంబేద్కర్ చిత్రపటం, రాజ్యాంగ పుస్తకం ఉంచాలని దళిత శక్తి ప్రోగ్రాం నిజామాబాద్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించి కలెక్టర్ ఎఓ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ సుమన్ మహారాజ్ మాట్లాడుతూ.. భారతదేశానికి దిక్సూచి అయినటువంటి భారత రాజ్యాంగం ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు అన్ని రంగాలలో అనువైన సహకారం అందించే విధంగా ప్రజలకు అభివృద్ధి దాయకంగా, దేశం అభివృద్ధి పథంలో నడిచే విధంగా తయారు చేసినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు గౌరవంగా ఉంచడం కోసం అలాగే రాజ్యాంగాన్ని అమలు చేసిన దినం అయినందువలన జండా కార్యక్రమం రోజు జాతీయ జెండా వద్ద రాజ్యాంగ పుస్తకం రాజ్యాంగ రచయిత కర్త అంబేద్కర్ చిత్రపటం ఉంచాలని అన్నారు. ఈ విషయను సారం ఈనెల 18న కలెక్టర్ కు గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే జెండా కార్యక్రమాల వద్ద రాజ్యాంగ పుస్తకం, అంబేద్కర్ చిత్రపటం ఉంచేలా సర్క్యులర్ జారీ చేయాలని వినతిపత్రం అందజేయడం జరిగింది, కానీ శనివారం వరకు కలెక్టర్ ఎలాంటి సర్క్యులర్ జారీ చేయనందున కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. శనివారం అంబేద్కర్ చిత్రపటం, రాజ్యాంగ పుస్తకం ఉంచేలా సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని దళిత శక్తి ప్రోగ్రాం వారు అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:14PM