- ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్
- నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ లో ధర్నా
నవతెలంగాణ కంటేశ్వర్
63% ఫిట్మెంట్ తో జులై 1 2018 నుండి పిఆర్సీ అమలు చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు. తక్షణమే పిఆర్సి రిపోర్టును పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని, 63% ఫిట్ మెంట్ తో జులై 2018 నుండి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యవేదిక ఇచ్చిన పిలుపులో భాగంగా జనవరి 23న శనివారం నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
పిఆర్సీ రిపోర్టు ప్రభుత్వానికి చేరి 3వారాలైనా ఇంతవరకు పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడం, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలకు రిపోర్ట్ నుఅందించక పోవటంసరైంది కాదన్నారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో 1-4-2019 నుండి 20%, ఆతర్వాత 1-7-2019నుండి 27 శాతం ఐఆర్ తో పాటు అన్నిరకాల ఆర్థిక ప్రయోజనాలు గత రెండున్నర సంవత్సరాలుగా పొందుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో మూడు నెలల్లో రిపోర్ట్ అని చెప్పి 32 నెలలు గడిచిపోతున్నా ,ఇంతవరకు పిఆర్సి కి అతీగతి లేకపోవటం దారుణం అని అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సమక్షంలో 2018 మే 16న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంటా, 3 నెలల్లోనే కడుపునిండా పిఆర్సి ఇస్తానని, 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇస్తామని, ప్రపంచ మహాసభలసాక్షిగా పండితులు పి ఈ టి లకుఉప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులనుపర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ అమలు చేయాలని, సిపిఎస్ ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు అధికసంఖ్యలో ఈ ధర్నా లో పాల్గొన్నారు. ఈ ధర్నాను సీఐటీయూ జిల్లా నాయకులు రమేష్ బాబు ప్రారంభించారు.ప్రభుత్యం వెంటనే చర్చలు జరిపి పీ ఆర్ సి నీ అమలుచేయాలని డిమాండ్ చేశారు.ఇంకా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ శంతన్ టి పి టి ఎఫ్ దేవి సింగ్,మాట్లాడారు ధర్నా లో జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాద్రి రావు, ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ రావు జిల్లాఉపాధ్యక్షులు ముత్తారంనరసింహస్వామి, ప్రభురావు, షహీద్, ప్రసాద్, సిర్పలింగం, బట్టి గంగాధర్, ఈ.వి.ఎల్ నారాయణ, లావువీరయ్య ఐటీ ఐ. కాంట్రాక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:18PM