నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
గ్రామ కార్యదర్శి విధులు నిర్వహించేలా చూడాలని వీరన్న గుట్ట గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు శనివారం కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బైండ్ల రాజు మాట్లాడుతూ గ్రామపంచాయతీ రోడ్డుపైన అక్రమంగా వడ్డెర కులానికి చెందిన సిరివేణి మల్లేష్ ప్రహరీ గోడ నిర్మించకుడదు అని గ్రామ కార్యదర్శి సాయికిరణ్ నోటీసులు జారీ చేశారు. అట్టి నోటీసులను మల్లేష్ కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు అతని భార్య, కూతురు నోటీసులు తీసుకోకుండా దుర్భాషలాడరని అన్నారు. మల్లేష్ కూతురు చంద్రకళను గ్రామ కార్యదర్శి లైంగిక వేధించాడని, 30 వేల రూపాయల లంచం అడిగారని స్థానిక సంస్థల కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అని తెలియజేశారు. ఇట్టి విషయంపై గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు, పెద్ద మనుషులు విచారణ చేయగా ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని గ్రామస్తులందరూ తెలియజేయడం జరిగింది అని అన్నారు. ఇట్టి విషయాను సారం గ్రామ కార్యదర్శిని ఎంపీడీవో కార్యాలయంలో విధులు నిర్వహించాలని ఎంపిడిఓ ఆదేశించారు అని అన్నారు. దీనిపైన ఈనెల 18న కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గ్రామ ప్రజలందరూ గ్రామ కార్యదర్శి లేనందున వృద్యాప పించన్లు, వన సేవకుల హాజరు రిజిస్టర్లు, గ్రామ పారిశుధ్య సిబ్బంది, ఉపాధిహామీ పనులు నిలిచిపోయాయని అన్నారు. సత్ప్రవర్తన కలిగిన గ్రామ కార్యదర్శి సాయికిరణ్ ను మా గ్రామము వీరన్న గుట్ట గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించే విధంగా చూడాలని అన్నారు. గ్రామ కార్యదర్శి పైన ఫిర్యాదు చేసిన వారి పైన చర్యలు తీసుకుంటూ కార్యదర్శిని విధులు నిర్వహించే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహమ్మద్ ఇమ్రాన్, మాజీ సర్పంచ్ ఎర్ర వినోద్ కుమార్, షేక్ ఇబ్రహీం, మహబూబ్, స్వామి, సాంబయ్య, దుర్గయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:23PM