నవతెలంగాణ కంటేశ్వర్
ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఐక్యవేదిక రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట శనివారం భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన చేపట్టడం జరిగింది. జిల్లా ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ పిఆర్సీ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన ఫిట్మెంట్ ప్రకటించి తక్షణమే అమలు చేయాలని, 2018 మే16 న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి జరిపిన చర్చలలో అంగీకారం కుదిరిన పద్దెనిమిది డిమాండ్లను తక్షణమే అమలు చేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని, కాలయాపన లేకుండా మేనేజ్ మెంట్ వారిగా పదోన్నతులు బదిలీల షెడ్యూలు తక్షణమే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ వెలువరించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని , కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుకు వెంటనే చర్యలు చేపట్టాలని స్టీరింగ్ కమిటీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈరోజు చేపట్టనున్న ఒక రోజు నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని జిల్లా స్టీరింగ్ కమిటీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసనలు తెలిపేందుకు రాజ్యాంగశీ కల్పించిన హక్కులో భాగమైన నిరాహారదీక్షను చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే భగ్నం చేయించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి అన్నారు. నిరసన ప్రదర్శన అనంతరం కలెక్టరేట్ ఏవో సుదర్శన్ కి మెమోరండం ఇవ్వడం జరిగింది. ఈ నిరసన ప్రదర్శనలో పి. శశీతన్, దేవి సింగ్, ధర్మేందర్, శ్రీధర్, సత్యనారాయణ, గంగారం, జనార్ధన్, లింగం, చంద్రశేఖర్, ఖలీమ్, మల్కన్న, తదితరులు పాల్గొన్నారు. ఇట్లు స్టీరింగ్ కమిటీ సభ్యులు ,(ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఐక్యవేదిక) నిజామాబాద్ జిల్లా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:29PM