నవతెలంగాణ కంటేశ్వర్
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలను నిరసిస్తూ జరుగుతున్న జీపు జాత మూడవరోజు నిజామాబాద్ నగరానికి శనివారం మధ్యాహ్నం చేరుకుంది. సిఐటియు నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కంటేశ్వర్ ప్రాంతంలో జీపు జాత బృందానికి పూలు చల్లుతూ నగర కార్మికవర్గం అపూర్వ స్వాగతం పలికారు. కార్యక్రమంకి హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ వి రమ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తానన్న ఏటా లక్ష ఉద్యోగాలు మాట దేవుడెరుగు అవి ఇవ్వకపోగా కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతూ తీసుకు వచ్చిన నల్ల చట్టాల వల్ల సంఘటిత రంగంతో పాటు అసంఘటిత రంగ కార్మికులు కూడా పని కోల్పోయి నిత్య దరిద్రం లోకి నెట్టివేయబడుతున్నారు అని అన్నారు, నరేంద్ర మోడీ విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక వర్గం అనేకమార్లు సమ్మెలో నిర్వహించింది రోడ్లపైకి వచ్చింది, ఇప్పుడు రైతాంగం కూడా వ్యవసాయాన్ని కార్పొరేట్ కబంధహస్తాల్లోకి వెళ్లనీయకుండా మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తున్న మదపుటేనుగులా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్మిక కర్షక పోరుయాత్ర ద్వారా ప్రజా చైతన్యం బీజేపీ కబంధహస్తాల నుండి ధ్వంసం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జాతకు నాయకత్వం వహిస్తున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, కార్యదర్శి పెద్ద సూరి, సిఐటియు సీనియర్ నాయకులు రమేష్ బాబు నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పళ్లకు వెంకటేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సుజాత , సిఐటియు నాయకులు జంగం గంగాధర్ కృష్ణ రాములు నరసయ్య స్వర్ణ వాణి సందీప తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:33PM