- వేతనాలు పెంచాలని, పీఎఫ్ ఈఎస్ఐ అమలు జరపాలని డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
అంగన్వాడి సమస్యలను పరిష్కరించాలని వేతనాలను పెంచాలని పీఎఫ్ ఈఎస్ఐ అమలు జరపాలని డిమాండ్ చేస్తూ శనివారం అర్బన్ సిడిపిఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ కంటేశ్వర్ రోడ్ లో గల సిడిపిఓ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి పెద్ద ఎత్తున తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 21 వేల రూపాయల వేతనం పెంచాలని, అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే పెన్షన్ సౌకర్యాన్ని అమలు జరపాలని కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వలన అంగన్వాడీ ఉద్యోగులకు భద్రత కరువు అవుతుందని పేదరికం దిగువన ఉన్న ప్రజలకు పౌష్టికాహారం అందకుండా పోతుందని ఆయన అన్నారు ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని అంగన్వాడీ లకు మినహాయింపు ఇవ్వాలని కోరారు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధుల వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు కరోనా కాలంలో కోత పెట్టిన వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు అనంతరం సిడిపిఓ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ, ప్రాజెక్ట్ కమిటీ నాయకులు వాణి, సందీప, సూర్య కళ, రాజ్యలక్ష్మి, సువర్ణ సునీత తదితరులతో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 04:40PM