నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కై ఎన్సిఎస్ఎఫ్ పరిరక్షణ కమిటీ శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండల సాయి రెడ్డి మాట్లాడుతూ చెరుకు రైతుల మంతా ఐకమత్యంతో ఉద్యమంతోనే పోరాటాలతోనే చక్కెర ఫ్యాక్టరీ ని కాపాడుకోగలమని అన్నారు. ముందు ముందు ఫ్యాక్టరీ పై రైతులతో చర్చించేందుకు గాను ముఖ్యంగా ఫ్యాక్టరీ ఆవరణలో ఫిబ్రవరి 12వ తేదీన రామ మందిరం లో మధ్యాహ్నం 1 గంటకు సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆ సమావేశంలో రైతు ఉద్యమ కార్యాచరణను తీసుకుంటామని అన్నారు. అందుకుగాను చెరుకు పండించే గ్రామాల అన్నిటిలోనూ విస్తృతంగా ప్రచారం జరుపుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గత ఎన్నికల్లో వంద రోజుల లో చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభిస్తాము అని హామి ఇచ్చిన మాటను గాలికి వదిలేశారని అన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను కేటాయించి ఫ్యాక్టరీ నడపడానికి ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నాయకుడి నరసయ్య, సిర్పూర్ గంగారెడ్డి, రాజా రెడ్డి, భాస్కర్ రెడ్డి, వేల్పూర్ భూమయ్య, సాయి రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 05:17PM