- జిల్లా సెక్టోరల్ అధికారి మంతటి నారాయణ
నవతెలంగాణ - తెలకపల్లి
ఉన్నత పాఠశాల లను జనవరి 25లోగా సిద్ధం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా సెక్టోరియల్ అధికారి నారాయణ సూచించారు శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన వారు ఫిబ్రవరి 1 నుండి 9, 10 తరగతు లు ప్రారంభమవుతు నందున ఉన్నత పాఠశాల ల ఆవరణ, తరగతి గదులు, కిచెన్ రూమ్ టాయిలెట్ లు శుభ్రము చేయించాలన్నారు. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అంగీకార పత్రాలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బలవంతంగా తల్లిదండ్రుల నుండి అంగీకార పత్రాలు తీసుకోవద్దని అన్నారు. తల్లిదండ్రుల ఇష్టం మేరకే అంగీకార పత్రాలు తీసుకోవాలన్నారు. అన్ని తరగతి గదులు పూర్తిగా శానిటేషన్ చేయించాలన్నారు.
ప్రతి పాఠశాలలో డిజిటల్ థర్మామీటర్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మాత్రమే కూర్చునే విధంగా సిటింగ్ ప్లాను తయారు చేసుకోవాలన్నారు. ఒక్క బెంచీ కి ఒక విద్యార్థిని కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. టాయిలెట్ల దగ్గరగా నీ, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు గానీ, పాఠశాలను వదిలి ఇళ్లకు వెళ్లేటప్పుడు గాని, గుంపులుగుంపులుగా ఉండకుండా మినిమమ్ ఆరు ఫీట్ల దూరం పాటించే టట్లు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు వదిలేటప్పుడు ముందుగా తొమ్మిదో తరగతి విద్యార్థులు ని వదిలి తర్వాత పదవ తరగతి విద్యార్థులను వదలాలి అన్నారు. వంట రూమ్ పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పాత బియ్యాన్ని ఎట్టి పరిస్థితిలో వాడకూడదని తెలిపారు. కొత్త బియ్యానికి మండల విద్యాధికారుల ద్వారా గుర్తించి పంపాలని తెలిపారు. సబ్బులు, మినీ శానిటైజర్ లను ఏర్పాటు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బాలస్వామి, ఆనంద్, సి ఆర్ పి రే నయ్య పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:09PM