- మండల తహశీల్దార్ కు మెమోరండం
నవ తెలంగాణ కోడంగల్
కొడంగల్ మండలంలోని అన్నారం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల స్థలం ఐదు ఎకరాల నాలుగు గుంటల స్థలం సర్వే చేయించి హద్దులు చూపించాలని మండల తహశీల్దార్ కు గ్రామస్తులు మెమోరండం అందించారు, ఈ సందర్భంగా లైఫ్ ఫౌండేషన్ ఫర్ యూత్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, గ్రామస్తులు మురళీధర్ రెడ్డి, శేఖర్ లు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల భూమి 5 ఎకరాల నాలుగు గుంటలు సర్వేనెంబర్ 201/ఆ, రెండు ఎకరాల 23 గుంటలు, 201/ ఇ/2 సర్వే నెంబర్లో రెండెకరాల 21 గంటలు ఉన్న భూమిని సర్వే చేయించి హద్దులు చూయించి కాంపౌండ్ వాల్ నిర్మించాలని అన్నారు, పాఠశాలకు కేటాయించిన భూమి కొంతమంది పెత్తందారులు కబ్జా చేసినట్టు, అమ్ముకుంటున్నట్లు అనిపిస్తుంది వెంటనే సర్వే చేయించి పాఠశాల స్థలాన్ని కాపాడాలన్నారు, పాఠశాల స్థలం ఆక్రమించిన వారిపై రెవెన్యూ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, చాలా రోజులుగా ఈ స్థలం ఖాళీగానే ఉండడంతో ఈ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని సర్దార్ స్థలంపై కన్నేసి ఆక్రమణ చేసుకుంటున్నారని అన్నారు, ఈ స్థలాన్ని వెంటనే సర్వే చేయించాలని డిమాండ్ చేశారు, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో ఇందనూరు బీములు, వార్డ్ మెంబర్ చాకలి బందెప్ప, చాకలి రాములు, జయప్ప తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:18PM