నవతెలంగాణ డిచ్ పల్లి
ఈనెల 20న ఆర్మూర్ లో జరిగిన వాలీబాల్ జిల్లా ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైన 16 మందికి ఇందల్వాయి మండలంలోని గన్నారం ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ శిబిరం శనివారం సర్పంచ్ కుంట మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ శిబిరాన్ని క్రీడాకారులు క్రమశిక్షణతో రాణించి కోచ్ లు చెప్పిన మెలకువలను నేర్చుకుని రాష్ట్రస్థాయిలో జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ క్రీడాకారులను శిక్షణా లను సద్వినియోగం చేసుకోవాలని, శనివారం నుండి 28 వరకు కొనసాగుతుందని, 28న తుది జట్టును ఎంపిక చేసి ఈ నెల 29 నుండి 31 వరకు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం మగ్గిడి పాఠశాల లో జరగనున్న సబ్-జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు పంపనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి వచ్చే క్రీడాకారులకు భోజన వసతి క్రీడా పరికరాలను సర్పంచ్ మోహన్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ , ఉప సర్పంచ్ రాజా ప్రసాద్ , జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం గంగ మోహన్,
జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి నరేంద్ర చారి, గన్నారం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎర్రన్న, కమిటీ సభ్యులు,శిక్షణ శిబిరం కోచ్, మేనేజర్లు సురేష్, యాదగిరి, భూపతి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్, ఆనంద్, అనిల్, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:24PM