నవతెలంగాణ-భిక్కనూర్
ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించిందుకు గాను మండల టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు భగవంతు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అగ్రవర్ణాల పేదల కోసం టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఆత్మ కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ బొడ నరేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్లూరి హనుమంత్ రెడ్డి, సొసైటీ చైర్మన్ గంగల్ల భూమయ్య, వైస్ చైర్మన్ ముచ్చర్ల రాజిరెడ్డి, రైతు సమన్వయ సమితి కన్వీనర్ బొండ్ల రామచంద్రం, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మధు మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు బండి రాములు, నాగభూషణం గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ముదాం సత్తయ్య, నాయకులు నరేందర్ రెడ్డి, నాయకులు నరేందర్ రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్, అంబాల్ల మల్లేశం, అల్లాడి సుదర్శన్, కైలాసం, వార్డు సభ్యులు వెంకట్ రాజం, భాను, చంద్రం, రవి, సొసైటీ డైరెక్టర్ వెంకట స్వామి గౌడ్, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:35PM