నవ తెలంగాణ సుల్తాన్ బజార్
నదుల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చీదల రాధా అన్నారు జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొగ్గులకుంట లోనితెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో జీవనదుల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చీదల రాదా పాల్గొని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నదుల పరిరక్షణకు కృషి చేస్తున్న జీవనది ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారాలను అందజేశారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం లీడర్ జిగేల్ జీవన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ, ప్రధాన కార్యదర్శి జీ.మంజుల రాణి, విజయ్, రంగాచార్యులు, గుదిబండి వెంకటరెడ్డి, డాక్టర్ విజయ సారథి, శివ రాణి ఠాకూర్, స్పందన, సార, మేరి, శ్రీదేవి తదితరులుపాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:44PM