నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
కరోనా కాలంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన అప్పటినుండి ట్రైన్ లు అన్ని నిలిచి పోవడం జరిగింది. ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు లు చేస్తూ ఒక్కోకటిగా సడలింపులు చేస్తూ తెరుచ్చుకోవడం జరుగుతున్న తరుణంలో సౌత్ సెంట్రల్ రైల్వే నాందేడ్ డివిజన్ ఏవోఎం కెఎం.రాయుడు ఒక ప్రకటనలో తెలుపుతూ ఆదిలాబాద్-తిరుపతి మధ్య ఁకృష్ణ ఎక్స్ ప్రెస్ఁ రైలు, ట్రైన్ నెంబర్ 07405 ఈనెల 27న తిరుపతి-ఆదిలాబాద్, ట్రైన్ టైం తిరుపతి నుండి ఉదయం 5 గంటల 50 నిమిషాలకు బయలుదేరుతుంది, ట్రైన్ నెంబర్ 07406 ఈనెల 28న ఆదిలాబాద్ - తిరుపతి, ఫ్రెండ్ టైం ఆదిలాబాద్ నుండి రాత్రి 9 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది అని అన్నారు. తిరుపతి - అదిలాబాద్, అదిలాబాద్ - తిరుపతి మధ్య కృష్ణ ఎక్స్ ప్రెస్ పున:ప్రారంభం కావడం జరుగుతుందని అన్నారు. ట్రైన్ యధావిధిగా 21 కోచ్ లతో ప్రారంభం కాబోతుంది అన్నారు. ట్రైన్ సమయం లో కూడా ఎటువంటి మార్పు లేదని తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:48PM