నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
కోవిడ్ పై పోరాటంలో తమ వంతు గా పాత్ర పోషించిన ప్రైవేటు హెల్త్ కేర్ వారియర్స్ కు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు శనివారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఐఎంఏ ప్రతినిధులతో ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ పై సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఈనెల 25 నుండి ఒక్కో కేంద్రంలో 100 నుండి 400 హెల్త్ కేర్ వర్కర్ల వరకు వ్యాక్సిన్ అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు ఐఎంఏ పూర్తి సహకారం అందించాలని సూచించారు. వ్యాక్సినేషన్ అందించడానికి హెల్త్ కేర్ వర్కర్ల జాబితాను సిద్ధం చేయడానికి ప్రతి హాస్పిటల్ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని తద్వారా ప్రతి ఒక్క హెల్త్ కేర్ వర్కర్స్ కు వ్యాక్సిన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డిఎంహెచ్వో లు, డిఐఓ, ఐఎంఎ అధ్యక్షులు డాక్టర్ జీవన్ రావు, కార్యదర్శి డాక్టర్ విశాల్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 23 Jan,2021 08:52PM