హైదరాబాద్: జాతీయ బాలికా దినోత్సవం (జనవరి 24)సందర్భంగా ప్రముఖ సంస్థ వారధి, ప్రెసిడెంట్ శ్రీధర్ కమ్మదానం మరియు డా.ఆనంద్ సంయుక్తంగా హైదరాబాద్ లోని మెహదీపట్నం ప్రాంతంలో ఉన్న రాధా కిషన్ అనాథ బాలికా గృహంలో ఉంటున్న బాలికలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమలో బంజారా మహిళా యన్ జీ వో చైర్మన్ డా.ఆనంద్, డా.రాజ్, డా.సరళ, డా.కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఆడ పిల్లలందరికీ ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించి సానిటరీ ప్యాడ్స్ మరియు కాల్షియం వంటి అవసరమైన మందులను అందిచడం జరిగింది. ఈ సందర్భంగా డా.ఆనంద్ మట్లాడుతూ, బాలిక రక్షణ వారి స్వాస్థ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి భాధ్యత అని, ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించిన వారధి సంస్థకు ధన్యవాదాలు తెలియజేసారు.
Mon Jan 19, 2015 06:51 pm