నవతెలంగాణ-కంటేశ్వర్
రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్యాచరణలో భాగంగా జనవరి మాసంలో ఒకేషనల్ ఎక్సలెంట్ సర్వీస్ అవార్డ్స్ లను అందించారు. తమ వృత్తిని సంపూర్ణంగా నిర్వహిస్తూ సేవా తాత్పర్యంతో ముందుకెళ్తున్న ఉద్యోగులకు ప్రోత్సాహకంగా అందించేదే ఈ ఒకేషనల్ సర్వీస్ అవార్డ్స్ అని అధ్యక్షులు దర్శన్ సింగ్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ ఏసిపి జి.శ్రీనివాస్ కుమార్ గౌరవ అతిథిగా నిజామాబాద్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎం.సుదర్శన్ హాజరై కేవలం మా ప్రభుత్వ సంస్థల కాకుండా అత్యంత భీకరమైన పరిస్థితులలో సేవా చేస్తున్న సంస్థలలో రోటరీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటూ అందరికీ తగిన సహాయ సహకారాలు అందిస్తూ అందరు కలిసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్న నందుకు అభినందనలు తెలిపారు. అనంతరం కోవీడు-19 ఈ సమయంలో పోలీసులు డాక్టర్లు ముందంజలో ఉండి నిజామాబాద్ జిల్లాకు అత్యంత సేవలందించారని అందుకే జిల్లా ప్రజలు కోవీడు నుండి రక్షణ పొందారని దీనిని దృష్టిలో ఉంచుకొని రోటరీ క్లబ్ ఒకేషనల్ ఎక్సలెంట్ అవార్డు లను అందజేస్తూ అభినందనలు తెలిపారు. అవార్డులు అందుకున్న వారిలో నిజామాబాద్ ఏసిపి జి. శ్రీనివాస్ కుమార్, ఎంఅండ్ హెచ్ వో డాక్టర్ ఆర్.సుదర్శనం, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, జిల్లా ఆయుష్ కోఆర్డినేటర్ శ్రీ డాక్టర్ రమణ మోహన్ కి ఘనంగా సత్కరిం. ఇంతే కాకుండా కోవీడు టైంలో ప్రభుత్వ ఆసుపత్రి తరఫున సేవలందించిన అటువంటి డాక్టర్లు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు అయినటువంటి డాక్టర్ ఆకుల విశాల్, డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ వి.కిరణ్ కుమార్, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ మధుసూదన్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ వెంకట్, డాక్టర్ సరస్వతి డాక్టర్ కౌలయ్ కి కూడా మెమెంటోలతో అభినందనలు తెలిప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు కార్యదర్శి బాబురావు, అసిస్టెంట్ గవర్నర్ ఆర్ జగదీశ్వర్ రావు, డాక్టర్ జి.కవలయ, జితేంద్ర మలాన్ని, గోపాల్ రెడ్డి, శ్యామ్ అగర్వాల్, రాజ్కుమార్ సుబేదార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:03PM