నవతెలంగాణ కంటేశ్వర్
బంజారా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ నందు షటిల్ బ్యాట్మెంట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు జనవరి 23,24 తేదీల్లో నిర్వహించడం అభినందనీయమని నిర్మల్ జిల్లా ఆర్డిఓ రమేష్ రాథోడ్ అభినందించారు. ఈ టోర్నీని నిజామాబాద్ శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ డాక్టర్ హరికృష్ణ ప్రారంభించారు. ఈ మేరకు ఆదివారం టోర్నీ ముగింపుకు ముఖ్య అతిథిగా నిర్మల్ ఆర్డిఓ రమేష్ రాథోడ్ నిర్మల్ పాల్గొని గెలిపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. నిజామాబాద్ బంజారా వాకర్స్ ఆధ్వర్యంలో ఈలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం ప్రతిరోజూ ఉదయం నడక మరియు షటిల్ ఆడడంవల్ల ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. మీరు ఇతరులకు ఆదర్శనంగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో తారాచంద్ నాయక్, చంద్రు నాయక్, బాబురామ్ నాయక్, సాలియా నాయక్, లక్ష్మణ్ నాయక్,లచ్చిరామ్ నాయక్ మరియు ఇతర ఆటగాళ్లు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:06PM