నవతెలంగాణ-గుండాల
రేపు కొత్తగూడెంలో జరగనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) పినపాక నియోజకవర్గ నాయకులు తోలెం గోపి, గుండాల మండల కార్యదర్శి జోగ నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పోడు రైతుల పై ఫారెస్ట్ దాడులను ఆపాలని, పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కొత్తగూడెంలో జరుగు చలో కలెక్టరేట్, ప్రజా గర్జన సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దుగ్గి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:09PM