నవ తెలంగాణ-పెబ్బేరు
కరెంట్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం శ్రీరంగాపురం మండల కేంద్రానికి చెందిన రైతు సింగల్ విండో డైరెక్టర్ సింగోటం నాయుడు (55) తన వ్యవసాయ పొలం వద్ద వరి పంట సాగు చేశారు. పొలానికి నీరు పెట్టేందుకు స్టార్టర్ వద్ద మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లగా వైర్లు తేలుకొని ఉండగా అది గమనించక పోవడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చేందారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియడంతో మృతదేహం వద్ద కన్నీరు మున్నీరుగా రోదించారు. తనకున్న ఐదెకరాల పొలంలో రెండో పంటగా వరి పంటను సాగు చేశాడు. గ్రామంలో మంచి పేరున్న వ్యక్తి గా రైతులకు చేదోడు వాదోడుగా ఉండి ఒక్కసారిగా కరెంట్ షాక్ ప్రమాదంలో మృతిచెందడంతో శ్రీరంగాపూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. సింగోటం నాయుడు మృతిపై ప్రజా ప్రతినిధులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సింగోటంకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. సింగోటం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:14PM