నవతెలంగాణ కంటేశ్వర్
ఎంపీ వెంటనే రాజీనామా చేయాలని పసుపు రైతులకు మద్దతుగా టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సబందర్భంగా టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినెటర్ శ్రీనివాస్ గైడ్ ఆధర్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేవారు. ఎంపీగా గెలిచిన అయిదు రోజులలో పసుపు బోర్డ్ మరియు పసుపు పంటకు 10 వేలు మద్దతు ధర తీసుకువస్తా లేని పక్షంలో ఎంపీ పదవికి రాజీనామా చేప్పారు. పసుపు బోర్డ్ తేకుండా, ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా అబద్ధపు మాటలు చెపుతూ రైతులను మోసచేసిన ఎంపీ వెంటనే రాజీనామా చేయాలన్నారు. మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు కొరకు ఎనలేని కృషి చేరన్నారు. ఎంపీ గా ఎన్నికైన నాటి నుండి పార్లమెంట్ లో బోర్డు ఆవశ్యకతను గురుంచి మాట్లాడారు, బోర్డు ఏర్పాటు కోసం నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర ప్రభుత్వం లేఖలు రాయించారు, పసుపు పంటను పరిశీలించి పతంజలి యూనిట్ ఏర్పాటు కు స్వయంగా పతంజలి సీఈవో బాలక్రిష్ణన్, యోగ గురువు రాందేవ్ బాబా ను నిజామాబాద్ కు తీసుకుచారు. ఎంపీ అరవింద్ చెపుతున్న రీజనల్ స్పైసిస్ ఆఫీస్ కవిత పోరాటం వలన వచ్చింది, ఎంపీ అరవింద్ వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె.విజయ్.గులాభసింగ్, శ్రావణ్, వీరసింగ్,మల్లని శివ, వంశీకృష్ణ, నిహాల్, రోహిత్,మంగళ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:24PM