వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ తో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను సి.సి.ఎస్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్టు చేసారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి తొమ్మిడి ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నింధితులు వివరాలు తెలపిన వరగంల్ పోలీస్ కమిషన్ పి. ప్రమోద్ కుమార్ బరివట్ల సాయి (27), కటకం ప్రణయ్(22), బోనగిరి విజయ్ అలియాస్ కన్నా(29), పులిచేరు చందు అలియాస్ చంద్రశేఖర్(ప్రస్తుతం చర్లపల్లి జైలులోవున్నాడు) ముగ్గురు నిందితులతో పాటు పోలీసులు గతంలోనే అరెస్టు చేసిన చంద్రశేఖర్ ఆజాద్ గత కొద్ది నెలల క్రితం రోజువారి కూలీ పనులు చేసుకోని వచ్చిన డబ్బుతో నలుగురు నిందితులు మద్యం సేవించి జల్సాలకు పాల్పడేవారు. ఇలా నిందితులు జల్సాలకు పాల్పడటంతో నిందితులకు వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో నిందితులు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడేందుకు సిద్ధమైనారు. ఇందులో భాగంగా నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇంతేజా గంజ్ పరిధిలో మూడు, హన్మకొండ, మీ కాలనీ, చెల్పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చొప్పున తాళం వేసివున్న ద్విచక్రవాహనాలను నిందితులు చోరీ చేయడంతో పాటు హైదరాబాద్ నగరంలో మరో మూడు చోరీలకు పాల్పడ్డారు. నిందితుల్లో ఒకడైన బరిపట్ల సాయి 2017 నుండి 2020 మధ్య కాలంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట, సుబేదారి, కేయూసి, మట్వాడా, ఇంతేజా గంజ్, మీ కాలనీ, మహబూబాబాద్,గుండాల, హైదరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇండ్లల్లో చోరీలకు పాల్పడేవాడు. ఇండ్లల్లో చోరీలతో పాటు ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడటంతో పోలీసులు పలుమార్లు అరెస్టు చేసి జైలుకు తరలించడంతో పాటు నిందితుడిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మరో నిందితుడు కటకం ప్రణయ్ గతంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇండ్లలో పలు చోరీలకు పాల్పడటంతో పాటు హైదరాబాద్ లో తనతో సహజీవనం చేసిన హిజ్రాపై కత్తితో దాడిచేసిన సంఘటనలో నిందితుడు. కాగా మరో నిందితుడు ప్రస్తుతం చర్లపల్లి జైలులో వున్న నిందితుడు చంద్రశేఖర్ ఆజాద్ గతంలో ఇంతేజా గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారిదోపిడీ కేసుతో పాటు సికింద్రబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యయత్నం కేసు మరియు మీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనం చోరీ సంఘటనలో నిందితుడు. కాగా ఈ నెల 19వ తేదిన హైదరాబాద్ ఉప్పల్లో ఇంటిలో చోరీకి పాల్పడటంతో నిందితుడు చంద్రశేఖర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ద్విచక్ర వాహనాల చోరీలపై వరంగల్ పోలీస్ కమీషనర్ పి.ప్రమోద్ కుమార్ సూచనల మేరకు ఆపరేషన్స్ మరియు క్రైమ్స్ అదనపు డి.సి.పి మరియు ఇంచార్జ్ డి.సి.పి పుష్పా పర్యవేక్షణలో సి.సి.ఎస్ ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, హన్మకొండ ఇన్ స్పెక్టర్ చంద్రశేఖర్ అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ప్రస్తుతం అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితులపై నిఘా పెట్టారు. ఇందులో భాగంగా నిందితులు ఈ రోజు ఉదయం నిందితులు చోరీ చేసిన వాహనాలను అమ్మేందుకుగాను పద్మాక్షి గుట్ట నుండి మూడు వాహనాలపై వస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు సి.సి.ఎస్, హన్మకొండ పోలీసుల అధ్వర్యంలో హన్మకొండ బస్టాండ్ రోడ్డు మార్గంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో నిందితులను అదుపులోకి తీసుకోని విచారించడంతో నిందితులు ఇచ్చిన సమాచారంతో పద్మాక్ష్మీ గుట్టల్లో రహస్యంగా దాచిన వుంచిన మరో ఆరు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ
నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన సి.సి.ఎస్. ఇన్ స్పెక్టర్ రమేష్ కుమార్, హన్మకొండ ఇనన్స్ స్పెక్టర్ చంద్రశేఖర్, సి.సి.ఎస్ ఎస్.ఐ సంపత్ కుమార్, ఎ.ఎస్.ఐలు శివకుమార్, శ్రీనివాసరాజు, హెడ్ కానిస్టేబుల్లు హమద్ పాషా, రవికుమార్, జంపయ్య కానిస్టేబుళ్లు మహమ్మద్ ఆలీ, వేణుగోపాల్, రాజశేఖర్, నజీరుద్దీన్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 05:48PM