నవతెలంగాణ-చిన్నకోడూరు
అక్షరం, ఆరోగ్యం, ఆర్ధికం స్వేరోస్ లక్ష్యమని స్వేరోస్ ఇంటర్నేషనల్ సిద్దిపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి సుంచు సుధాకర్ అన్నారు. చిన్నకోడూర్ మండల కేంద్రంలో ప్రతి ఆదివారం రోజున నిర్వహించే బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణ "జ్ఞాన దర్శనం" పున:ప్రారంభ కార్యక్రమం వడ్లకొండ శ్రావణ్ అద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుంచు సుధాకర్ హజరై మాట్లాడుతూ జ్ఞాన ప్రచార కార్యక్రమాలను ప్రతి ఊరికి ముందుకు తీసుకేల్లడంలో స్వేరోస్ ముందుండాలని కోరారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రతి జెండా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డా" బాబాసాహేబ్ చిత్రపటం పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూరు అద్యక్షులు ఏరోల్ల సందీప్ కూమర్, ఉపాద్యక్షులు కోయ్యడ నాగరాజు, కార్యవర్గ సభ్యులు పిడిశేట్టి రాజు,గాజుల స్వామి, మచ్చ అశోక్, అంబేద్కర్ వాది ఏర్రోల్ల బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 07:07PM