నవతెలంగాణ - తెలకపల్లి
కడుపు నొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని కార్వంగ గ్రామానికి చెందిన కాకునూరు సత్యనారాయణ (30) గత కొంత కాలంగా కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా శనివారం అర్ధరాత్రి కడుపు నొప్పి రావడంతో భరించలేక ఇంటిదగ్గర ఉన్న బాత్ రూంలోకి వెళ్లి ఉరి వేసుకున్నట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సత్యనారాయణ కనబడకపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతని సెల్ ఫోన్ కి ఫోన్ చేయగా బాత్రూంలో ఫోన్ శబ్దం వినడంతో వెళ్లి చూడగా ఉరి వేసుకొని ఉండడంతో స్థానికుల సహాయంతో నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మృతుని తండ్రి లక్ష్మయ్య ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వారు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 07:09PM