నవతెలంగాణ-భిక్కనూర్
పట్టణ శివారులోని స్థానిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వెనకాల గల ప్రైవేటు వెంచర్‌లో బ్లాస్టింగ్ జరిగింది. ఆదివారం వెంచర్ పరిధిలో ఉన్న బండలను పగలగొట్టేందుకు వెంచర్ యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ లు చేపట్టారు. విషయం తెలుసుకున్న పట్టణ సర్పంచ్ తునికి వేణు, ఉప సర్పంచ్ బోడ నరేష్ సంఘటన స్థలానికి చేరుకొని బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు పగుళ్ళు ఏర్పడ్డాయని, అలాగే చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకముందు ఇలాంటి చర్యలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Jan,2021 08:13PM