ఆదిలాబాద్: ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలోని ప్రయివేలు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా గోదాంలోని రేకుల షెడ్డు నుంచి మంటలు ఎగిసి పడటం చూసి స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పినా ఫలితం లేకపోవడంతో గోదాంలోకి ప్రవేశించేందుకు బుల్డోజర్తో గోడలు కూల్చివేశారు. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm