నవతెలంగాణ-చిన్నకోడూరు
అప్పుల బాధతో రైతు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని రామునిపట్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొయ్యడ మల్లయ్య(60) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో తీసుకున్న అప్పులు ఎక్కువగా కాగా మనస్తాపానికి గురైన మల్లయ్య ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రాత్రి నుండి వేతకగా సోమవారం ఉదయం బొల్లం సిద్దయ్య వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. అప్పటికే మృతి చెందగా పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. చిన్న కోడూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 02:09PM