- అఖిలపక్ష రాజకీయ పార్టీల పిలుపు
నవతెలంగాణ కంటేశ్వర్
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వాహన ర్యాలీని జయప్రదం చేయాలి అని అఖిలపక్ష రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి ఈ మేరకు సోమవారం నిజామాబాద్ నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ, న్యూ డెమోక్రసీ,టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు మాట్లాడుతూ.. ఢిల్లీలో 59 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న రైతుల పోరాటానికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతులు పండించే పంటలకు మద్దతు ధర చట్టబద్ధం చేయాలని డిమాండ్ లతో దేశ వ్యాప్తంగా జరిగే ట్రాక్టర్ల, వాహనాల ర్యాలీని నిర్వహించటానికి నిర్ణయించారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఐటిఐ నుండి బడా బజార్ నెహ్రూ పార్క్ , గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు ట్రాక్టర్లు, వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో రైతులు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికే పది సార్లు కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపినప్పటికీ సమస్యను పరిష్కరించకుండా దాటవేసే ధోరణితో వ్యవహరించడం వల్లనే అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు అని, ఇంకా సమస్య తీవ్రతరం కాకుండా ఉండాలంటే వెంటనే ప్రభుత్వం చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు, నిజాంబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని వారు అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి భూమయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శులు వనమాల కృష్ణ, పి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తాహెర్బిన్ హందాన్, టీడీపీ నాయకులు కె. నర్సింలు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ద వెంకట్ రాములుు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 02:14PM