నవతెలంగాణ కంటేశ్వర్
రైతుల పోరాటానికి మద్దతుగా రేపు జరగబోయే ట్రాక్టర్ పరేడ్ కు ఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను మరియు విద్యుత్ ఉపసంహరణ బిల్లులను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎముకలు కొరికే చలిలో రైతన్నలు ఉద్యమాలు చేస్తుంటే బిజెపి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. అంబానీ ఆదానీ లకు ప్రధానమంత్రి మోదీ మొకల్లురీడడం ప్రజాస్వామ్యాన్ని ఖునిచేయడమే అని ప్రభుత్వాన్నీ ప్రశ్నించారు. ఈ పరేడ్ లో యువకులు విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 02:34PM