- స్ధాయికి మించి మాట్లాడితే సహించేదే లేదు
- జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్
నవ తెలంగాణ కోడంగల్
అభివృద్ధికి సలహాలు ఇస్తే స్వీకరిస్తామే తప్ప స్ధాయికి మించి మాట్లాడితే సహించేదే లేదని జడ్పీటీసీ కోట్ల మహిపాల్ అన్నారు. దౌల్తాబాద్ మండలంలోని విలేకరుల సమావేశంలో మహిపాల్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా ప్రతి పక్ష నాయకులు అనవసరమైన రాద్దంతం చేస్తూ పేపర్ కవరేజీ కోసం సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈవిధంగా చేయడం వలన రెండు వర్గాల ను రెచ్చగొటే ప్రయత్నం చేస్తూ ప్రశాంతంగా ఉన్న కొడంగల్ ప్రాంతంను అనవసరంగా రాజకీయ విమర్శలు చేస్తూ అశాంతి నెలకొల్పేందుకు కుట్రలు చేస్తున్న రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయలని ఎదైన ఉంటే అభివృద్ధితో పోటీపడాలే తప్ప సామన్య ప్రజలను రెచ్చగొటి రాజకీయం చేయడం సరికాదని అని హెచ్చరించారు. అలా కాని పక్షంలో ప్రజలు అమాయకులు కాదు అన్ని గమనిస్తున్నారు. మీ లాంటి జుఠ కోర్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, మాజీ సర్పంచ్ సంతోష్, టి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 03:16PM