నవతెలంగాణ పెద్దవూర
తమకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలంటూ సోమవారం మండలంలోని పర్వేదుల సబ్ స్టేషన్ ముందు 100 మంది రైతులు ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ పర్వేదుల సబ్ స్టేషన్ పరిధిలోని నంబాపురం ,పర్వేదుల,జయరాం తండా,సుద్ద బాయి తండా,కోమటి కుంట తండా లకు విద్యుత్ సరఫరా చేయాలిసి ఉండగా,అదనంగా పెద్దగట్టు,బూడిద గట్టు,ఎల్లాపురం,గ్రామాలకు విద్యుత్ సరఫరా చేస్తుండడంతో లోఓల్టేజితో తరచు మోటార్లు కాలి పోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.కొంత కాలంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుందని, ఈ విషయ మై ట్రాన్స్కో అధికారుల కు ఎన్నో సార్లు చెప్పామని, అయినా పట్టించు కోవడం లేదని ఆరోపించారు.ఒక్క నంబాపురం లొనే 50 మోటార్లు కాలి పోయాయని,మోటర్ల రిపేర్లకు వేలాది రూ.ఖర్చు అవుతుందని తెలిపారు.ఇలా అయితే మా పొలాలలో పంటలు ఎలా పండించు కోవాలని ఆందోళనకు దిగారు.నాణ్యమైన విద్యుత్ అందించక పోతే మళ్ళీ సబ్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని అన్నారు. ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తు సరఫరా చేస్తుంటే, 8 గంటలు కూడా సరఫరా ఇవ్వడం లేదని నిరసన తెలుపుతూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సబ్ స్టేషన్ ముందు బైఠాయింఛారు. ఈవిషయం తెలుసుకున్న సాగర్ సి ఐ, గౌరీనాయుడు,పెద్దవూర ఏ ఎస్ ఐ అహ్మద్ వచ్చి ట్రాన్స్ కో ఎస్ ఈ, డి ఈ, తో ఫోన్లో మాట్లాడి రెండు మూడు రోజుల్లో నాణ్యమైన విద్యుత్ ఇస్తా మని చెప్పడం తో ధర్నా విరమించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 03:41PM