- తెలంగాణా విశ్వ బ్రాహ్మణ సంఘం
నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
'బంగారు బుల్లోడు' సినిమాను వెంటనే నిలిపి వేయాలని తెలంగాణా విశ్వ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. విశ్వబ్రాహ్మణ జాతిలో విశ్వకర్మ వృత్తులు చేసే పంచదాయ వృత్తులలో స్వర్ణకార వృత్తి దారుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నిర్మించిన 'బంగారు బుల్లోడు' సినిమా ఉందని అన్నారు. ఈ సినిమాను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఎఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు తంగళ్ళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ..... బంగారు బుల్లోడు సినిమాలో స్వర్ణకార వృత్తి చేసే వారిని కించపరిచేలా సన్నివేశాలున్నాయని అన్నారు. సినిమాలో ఈ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు తీవ్రంగా నిరసనను వ్యక్తం చేస్తున్నాము అని అన్నారు. పంచదాయులకు వృత్తులు లేక జీవన ఉపాధి కోల్పోతున్న తరుణంలో వివిధ బ్యాంకులలో అప్రైజర్ గా పని చేస్తూ బంగారు రుణ సదుపాయం పై అరకొర కమిషన్ తో పనిచేస్తున్న అప్రైజర్ లను దొంగలుగా చిత్రీకరించే సన్నివేశం, తాకట్టు లో ఉన్న బంగారాన్ని దొంగచాటున ఇచ్చే చిత్రీకరణ, దేవాలయాలలో నకిలీ ఆభరణాలు స్వర్ణకారులు ఉంచినట్లుగా చూపించే సన్నివేశం, సినిమాలో హీరోయిన్ తండ్రి హీరో అల్లరి నరేష్ తో కొలిమి దగ్గర గోట్టముదే నా.. నీకు నా కూతుర్ని ఇవ్వాలేను అని దుర్భాషలాడే మాటలు మా విశ్వబ్రాహ్మణుల కుటుంబాల వివాహ బంధాలపై తీవ్ర ప్రభావం చూపనుంది అని అన్నారు. కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు ఒత్తాసు పలికే విధంగా స్వర్ణకారుల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఉన్న సినిమా చిత్రీకరణ బంగారు బుల్లోడు సినిమాను వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.రామ్మోహన్ ఆచారి, యాదోజు శ్రీనివాసాచారి, మచ్చర్ల శ్రీహరి, సిద్ది రమేష్, టీకాజి రాజు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 04:21PM