- హుండిలను ఎత్తుకుని దూరం వేసిన వైనం.
దాదాపు 2లక్షల పైనే ఉన్నట్లు అనుమానం.
నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్వాయి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సయ్యద్ హసిన్ అహ్మద్ ఖలందర్ దర్గాలో అదివారం అర్ధరాత్రి దొంగతనం చోటు చేసుకుందని దర్గా లో ఉన్న రెండు హుండిలను దుర్గా నుండి దూరంగా తీసుకువెళ్లి పగలగొట్టి అందులో ఉన్న నగదును, వెండి, బంగారం లను దోచుకెళ్లారని దర్గా నిర్వాహకులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
ఇందల్వాయి మండల కేంద్రంలోని జాతీయ రహదారికి అనుకొని ఉన్న సయ్యద్ హసిన్ అహ్మద్ ఖలందర్ దర్గా లో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బయట ఉన్న తాళాలను పేగులు గోట్టి, బయట ఉన్న ఒక హుండీ, అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇంకో హుండీని దొంగలించి శివారు ప్రాంతంలోకి తీసుకెళ్ళి అందులో ఉన్న నగదును, వెండి, బంగారం దోచుకున్నారని నిర్వాహకులు తెలిపారు. సోమవారం ఉదయం దర్గా శుభ్రం చేయడానికి వచ్చిన వారు రెండు చోట్లా తాళాలు పగులు గోట్టి ఉండటం చూసి దర్గా కమిటీ సభ్యులకు తెలిపారు. వారు వచ్చిన వెంటనే పోలిసులకు సమాచారం ఇచ్చారు. గత కొద్దిరోజులుగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఘనంగా ఉర్సు ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రంలోని పలు జిల్లాలు, మండలాల నుండి పేర్లు ఎత్తున వేలాది మంది భక్తులు తమ తమ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని వారికి తోచిన విధంగా హుండి లో నగదు, వెండి, బంగారం వేయడం జరుగుతుందని, ఈ హుండీలను ప్రతి సంవత్సరానికి ఒకసారి దర్గా కు సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో లెక్కింపు చేయడం జరుగుతుందని ప్రతి సంవత్సరం సుమారు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని నిర్వాహకులు తెలిపారు. దర్గా ప్రాంతాన్ని రాత్రి సమయంలో పోలీసులు ద్వారా పెట్రోలింగ్ నిర్వహించే విధంగా కృషి చేయాలని దర్గా కమిటీ సభ్యులు పోలిసులను కోరారు. గతంలో దర్గా వద్ద పలువురు రాత్రి సమయంలో ఉండేవారని,గత కోన్ని నేలల నుండి రాత్రి సమయంలో ఉండటం లేదని నిర్వాహకులు తెలిపారు. పోలిసులు వేలి ముద్రల ఆధారంగా దోంగతననికి పాల్పడ్డ వారిని పట్టుకుని మరోసారి ఇలాంటి సంఘటన లు చోటు చేసుకోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ సభ్యులు ఖదీర్ ఖురేషి,తజోద్దిన్, కో ఆప్షన్ సభ్యుడు షేక్ హుస్సేన్,షేక్ రహీమ్, రషీద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 05:23PM