నవతెలంగాణ డిచ్ పల్లి
ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతి పథం కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామం మహిళా సంఘాల అధ్యక్షులు లతో ఇసి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎపిఎం సువర్ణ మాట్లాడుతూ మండలంలోని మొత్తం రుణాల టార్గెట్ ఈ సంవత్సరానికి గాను 21 కోట్ల 80 లక్షలు టార్గెట్ ఉండగా అందులో ఇప్పటి వరకు 15 కోట్ల 38 లక్షల రూపాయలు రుణాల రూపంలో సభ్యులకు ఇచ్చామని అలాగే శ్రీ నిధి ద్వారా నాలుగు కోట్లకు గాను ఒక కోటి 33 లక్షల రూపాయలు ఇప్పటివరకు గ్రూప్ సభ్యులకు చెల్లించాం, ప్రతి సభ్యులకు గ్రూపు లీడర్లకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా లోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎటిఎం సువర్ణ అన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాలతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి సభ్యురాలు గ్రూపులో చేర్పించుకునే విధంగా గ్రామాలలో గ్రూప్ లీడర్లు కృషిచేయాలని, గ్రామాలలో రైతు మహిళా సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉండడంతో ఆ విధమైన శిక్షణ సభ్యులకు ఇస్తున్నట్లు ఏ పీ ఎం సువర్ణ తెలిపారు.మండలంలో ఇప్పటి వరకు మొత్తం 106 గ్రూపు ఏర్పాటు చేశామని అలాగే వివిధ గ్రామాల అధ్యక్షులకు పొదుపులు, బ్యాంకు చెల్లింపుల పై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు తీసుకున్న రుణాన్ని సకాలంలో బ్యాంకులో చెల్లించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.ఈ సమావేశంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మమత, సి సి లు గోవింద్, అనురాధ, కార్యదర్శి మమత, ఉపాధ్యక్షురాలు సవిత తో పటు వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 05:28PM