నవతెలంగాణ-భిక్కనూర్
రాజంపేట మండల కేంద్రానికి చెందినటువంటి గ్రామ సర్పంచ్ సౌమ్య పలు అవకతవకలకు పాల్పడుతూ గ్రామ అభివృద్ధికి సహకరించడం లేదని పాలకవర్గ సభ్యులు కొప్పుల నరేష్ , ఇమ్రాన్ అలీలు సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామ అభివృద్ధికి సహకరించడంలేదని స్థానికంగా ఉండకుండా పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రతి గ్రామ సమస్యలలో భార్య సర్పంచ్ అయితే భర్త పెత్తనం చెలాయిస్తున్నారని, సంవత్సరం కాలం నుండి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కు సంబంధించి నాలుగు లక్షల 81 వేల రూపాయలను విత్ డ్రా చేసి ట్యాంకరు, డోజర్ చేయిస్తానని తీసుకురాకుండా మాట దాటవేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.
ప్రజలకు అందుబాటు ఉండి సేవ చేస్తున్న : సర్పంచ్ సౌమ్య నాగరాజు
రాజంపేట మండలంలో ప్రతి పనిలో తాను స్వయంగా భాగస్వాములై అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తనకు గిట్టని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ సౌమ్య నాగరాజు అన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకే తాము ట్యాంకర్ ట్రాలీ ట్రాక్టర్ గ్రామ పంచాయతీ తీర్మానం మేరకే తీసుకురావడం జరిగిందని, గ్రామంలో మంచి చెడులకు అండగా ఉండి పేదింటి ఆడపడుచులకు సైతం తన వంతు సహకారం అందిస్తానని ఆమె అన్నారు. గ్రామపంచాయతీలో ఎలాంటి అవకతవకలు లేవని తనకు గిట్టని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 05:31PM