- జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు
నవతెలంగాణ - తెలకపల్లి
మండలంలోని ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలలను పరిశుభ్రంగా ఉంచాలని నాగర్ కర్నూలు జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు ఎం ఈ ఓ చంద్రుడు నాయకులు అన్నారు. సోమవారం మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ గౌరెడ్డి పల్లి, జడ్.పి.హెచ్.ఎస్ తెలకపల్లి, కేకే రెడ్డి పాఠశాలలను వారు తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాల ప్రారంభించాక ప్రతి విద్యార్థి మాస్కు తప్పని సరిగ పెట్టాలని శానిటైజర్ వాడాలని, విద్యార్థి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలని, ఒక క్లాసు రూమ్ లో 20 మంది విద్యార్థుల కంటే ఎక్కువగా ఉండకూడదని సూచించారు. అలాగే ప్రతి పిల్లవాని తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని ఈ నెల 31వ తేదీ వరకు విద్యార్థులతో తప్పనిసరిగా తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ చంద్రుడు నాయక్ తో పాటు ప్రధానోపాధ్యాయులు బుచ్చి బాబు, ఉపాధ్యాయులు సి ఆర్ పి రేణయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 05:41PM