నవతెలంగాణ డిచ్ పల్లి
44వ నెంబర్ జాతీయ రహదారి నడిపల్లి తండా సమీపంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపు తప్పి రాహదరి పక్కనే ఉన్న ఇనుప గ్రిల్ ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం కమ్మర్ పల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన గడ్డం రాజేశ్వర్(31 ) గత కొన్ని నెలల క్రితం తన వరికోత మిషన్‌ను కర్ణాటక రాష్ట్రం లోకి తీసుకుని వెళ్లి అక్కడ వరి కోతలు ముగించుకొని ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణం అవుతుండగా నడ్పల్లి తండ వద్దకు రాగానే ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇనుప గ్రిల్ ను ఢీకొని తలకు తీవ్ర గాయాలయ్యాయి. రాజేశ్వర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు. మృతునికి భార్య ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించినట్లు ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 05:47PM