నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న ప్రజాస్వామ్యం మనదని దాని పటిష్టానికి ప్రతి ఒక్కరం కంకణబద్ధులై ముందుకు వెళ్లాల్సి ఉందని కలెక్టర్ 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ నేషనల్ ఓటర్స్ డే ను జరుపుకుంటున్నా మన్నారు. ప్రతి సంవత్సరం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని వివిధ కార్యక్రమాలతో పెద్ద ఎత్తున జరుపుకునే వారమని ఈసారి కోవిడ్ వల్ల తగ్గించి జరుపుకుంటున్నామన్నారు. జిల్లాలో కొత్తగా ఓటరుగా పేరు నమోదు చేసుకున్న 10,335 మందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఓటరుగా నమోదైన వారు ఇక ముందు జరగబోయే ఎన్నికల్లో మీకు నచ్చిన నాయకుడుని ఎన్నుకోవడానికి మీరు అర్హులుగా ఓటర్ లిస్ట్ లో నమోదు కావడం అనేది నిజంగా ఒక అదృష్టం గా భావించవచ్చన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపమని, అనేక ప్రాంతాలు, సంస్కృతులు, జీవన విధానాలతో పెనవేసుకుని ప్రజలు జీవనం సాగిస్తున్నారని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక తాటిపైకి తీసుకువచ్చి అందరిని ఒక మార్గంలో మన భారత రాజ్యాంగం నడిపిస్తుందని అది మన రాజ్యాంగ గొప్పతనం అని అన్నారు.
అందులో అంబేద్కర్ గొప్పతనాన్ని ఈ సందర్భంగా అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం మనల్ని పాలిస్తున్నదని అది మన రాజ్యాంగ గొప్పతనం అన్నారు. 1950 జనవరి 26 తేదీ రోజున రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకుంటే ఒక్కరోజు ముందు భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రపంచంలోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న దేశం మనదే అన్నారు. జనరల్ ఎన్నికలు ఒక మూడు నెలల్లో పూర్తి చేస్తాం ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఓటింగ్ కోసం అవగాహన కల్పించడం జరుగుతుంది అని అన్నారు. ఓటుహక్కు ఉన్నవారు అందరికీ ఓటు వేసుకునే హక్కు ఎన్నికల సంఘం కల్పిస్తుంది అమెరికా కూడా పవర్ చేంజ్ లో అనేక సంక్షోభాలు ఎదుర్కొంటుందని భారతదేశంలో పవర్ సింపుల్ గా జరుగుటకు కారణం అది మన రాజ్యాంగం, మన ఎన్నికల సంఘం యొక్క గొప్పతనం అని అన్నారు. సంప్రదాయం మన బ్లడ్ లో ఉందని ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవించాలని, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే పాలకులు అనే సిద్ధాంతం ప్రజాస్వామ్య విలువలను గౌరవించే తత్వం అనేవి మన సంస్కృతి లోనే ఉన్నదని, మన జిల్లాలో సాధారణ ఎన్నికల్లో
దేశంలోనే రికార్డ్ స్థాయిలో అత్యధిక అభ్యర్థులు పోటీలో నిలబడితే కూడా అధికారులు పగడ్బందీగా ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించి భారత దేశానికి రికార్డు నెలకొల్పిన ఒక సంఘటన అన్నారు. భారత ఎన్నికల సంఘం ఈరోజు నుంచి జనవరి 31 వరకు కొత్త ఎపిక్ కార్డ్ ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించిందని అన్నారు, ఫిబ్రవరి 1 నుండి అందరికీ కూడా ఓటర్ నమోదు అయిన వారు ఎపిక్ కార్డ్ తీసుకోవచ్చు అన్నారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న యువతకు కొత్త ఓటర్ కార్డు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు 2020 కి ఎంపికైన జిల్లా కలెక్టర్ ను అధికారులు శాలువా, పుష్పగుచ్ఛము తో సన్మానించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఉత్తమ బూత్ లెవల్ అధికారిగా ఎంపికైన ఖనీజ్ ఫాతిమాను కూడా కలెక్టర్, అధికారులు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమం లో టీఎన్జీవోస్ డైరీని , క్యాలెండర్ ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లతా, చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఆర్డిఓ రవి టీఎన్జీవోస్ అధ్యక్షులు అలుక కిషన్, సంఘ ప్రతినిధులు, జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 05:50PM