నవతెలంగాణ మల్కాజ్ గిరి
మల్కాజ్ గిరి సర్కిల్లో ఎన్నో అక్రమ సెల్లార్ లతో కూడిన నిర్మాణాలు జరుగుతున్న అవేమీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కక్ష గట్టి పార్టీ కార్యకర్త కట్టించుకున్న ఇంటిని కూల్చి వేయించారని నేరేడ్ మెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు అన్నారు. సోమవారం కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా టీఆర్ఎస్ మాజీ డివిజన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, జి కే బిల్డర్ హనుమంతరావు ఇద్దరూ కలిసి యాప్రాల్ లో ఐదు ఎకరాల స్థలాన్ని కొన్నారు ఆ స్థలంపై ఎమ్మెల్యే కన్ను పడి ఇద్దర్నీ పిలిపించి పలుమార్లు చర్చలు జరిపారు ఆ స్థలాన్ని వారు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే దౌర్జన్యంగా కబ్జా చేసి పొజిషన్ లోకి వెళ్లాడని దీనిపై కోర్టుకు వెళ్లి నోటీసులు పంపించగా కక్ష కట్టి ఆడవారిని అడ్డంపెట్టి తప్పుడు కేసులు పెట్టించి అరెస్టులు చేయించి కట్టుకున్న ఇండ్లను కూల్చి వేయించారని ఆరోపించారు.ఎమ్మెల్యే చేస్తున్న దౌర్జన్యాలను మంత్రులు,అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన స్పందన లేదని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ స్పందించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 05:57PM