- అధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం
నవతెలంగాణ కంటేశ్వర్
కోవిడ్ నిబంధనలతో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మాస్క్ ఉండాలని, మాస్కు లేనివారికి జిల్లా వైద్యశాఖ కోవిడ్ హెల్ప్ డెస్క్ ద్వారా అందివ్వాలని ప్రతి ఒక్కరూ శానిటైజర్ తప్పక వినియోగించాలని అధికారులను ఆదేశించారు. కుర్చీలు దూరంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏర్పాట్లు పరిశీలించిన వారిలో అడిషనల్ డిసిపి అరవింద్ బాబు, ఆర్డీవో రవి తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 06:12PM