- నిరుపేదల ఆస్తులకు అండగా ఉంటా
- కబ్జాలు చేస్తే సహించేది లేదు
నవతెలంగాణ మల్కాజిగిరి
అధికారాన్ని, పార్టీని అడ్డం పెట్టుకొని పేదల భూములు కబ్జాలు చేస్తే సహించేది లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేరేడు మెట్ డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి హనుమంతరావుపై మండిపడ్డారు. సోమవారం ఆనంద్ బాగ్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.నేరెడ్ మెట్ డివిజన్ కార్పొరేటర్ భర్త జీకే హనుమంతరావు మరియు డివిజన్ మాజీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఇద్దరూ కలిసి అధికారాన్ని,పార్టీని అడ్డం పెట్టుకొని ఎన్నో భూకబ్జాలకు పాల్పడ్డారని వారిని ప్రశ్నించిన వారిపై దాడులు చేయించి వారిపై అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ బాధితులను తిప్పుతున్నారని మండిపడ్డారు.
యాప్రాల్ లో చెరువులను కబ్జా చేసి సర్వే నెంబర్లు మార్చేసి అమ్ముకున్నారని ఆరోపించారు.ఓపెన్ నాళాలను,చెరువులను,రోడ్లను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టడంతో చిన్నపాటి వర్షానికి పరిసర ప్రాంతాలు నీటి ముంపునకు గురవుతున్నాయని అన్నారు.మీరు చేస్తున్న అక్రమాలను బయటపెట్టి మీకు నిద్ర లేని రాత్రులు చేస్తానని బహిరంగంగా హెచ్చరించారు. నేరెడ్ మెట్ లో మాజీ సైనికుల స్థలాన్ని కూడా విరు కబ్జా చేశారని దానిలో 26 జనవరిన జాతీయ జెండా ఎగర వేస్తున్నా నని దమ్ముంటే అడ్డుకోవాలని సవాల్ విసిరారు. కార్పొరేటర్ శ్రీదేవి ఈమె భర్త జీకే హనుమంతరావు, మధుసూదన్ రెడ్డి పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఇంతవరకు వారిని అరెస్టు కూడా చేయలేదని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకు తిరుగుతున్నారని ఇకనుంచి సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవు నీ భర్త జీకే హనుమంతరావు మాజీ డివిజన్ అధ్యక్షుడు చేసిన భూకబ్జా లన్నిటిని బయటకు తీసి మీకు నిద్ర లేకుండా చేస్తానని ఎవరు చెప్పినా వినను అని శపథం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 06:38PM