- ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
నవ తెలంగాణ కొడంగల్
కొడంగల్ మున్సిపల్ లోని ఎంపీపీ ముద్దప్ప దేశముఖ్, మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కోడంగల్ నియోజకవర్గంలోని మూడు కోట్ల నిధులతో బీటీ రోడ్డు పనులు పూర్తి చేస్తున్నామన్నారు, కోడంగల్, కోస్గి లలో 10 కోట్లతో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామన్నారు, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, గ్రామ గ్రామానికి బిటి రోడ్డు నిర్మిస్తున్నామన్నారు, కొడంగల్ నియోజకవర్గంలోని మైనారిటీలకు మూడు కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు, కోడంగల్ ప్రాంతానికి ఇన్చార్జి అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి కోడంగల్ వెనుకబడ్డ ప్రాంతానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టాలని కోరి అభివృద్ధి చేస్తుంటే రేవంత్ రెడ్డికి అభివృద్ధి చూసి ఓర్వలేక తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు, కోడంగల్ ప్రాంతానికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన రేవంత్ రెడ్డి ఏమీ అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు, అభివృద్ధి మాయం లోనే జరిగిందంటున్నా రేవంత్ రెడ్డి ప్రోసిడింగ్ లెటర్ తీసుకొని కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాకు చర్చకు రావాలన్నారు, కొండ రెడ్డి పల్లిని దత్తత తీసుకున్న రేవంత్ రెడ్డి కనీసం బీటీ రోడ్డు కూడా వేయలేదు అన్నారు, హైదరాబాద్ లో కూర్చొని కెసిఆర్, కేటీఆర్ లపై నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు, కోడంగల్ ప్రజలకు పిట్టకథలు చెప్పి మోసం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసిన కోడంగల్ ప్రజలు రేవంత్ రెడ్డి అభివృద్ధి చెయ్యలేడు అనే ఉద్దేశంతోనే ఇంటికి పంపించారన్నారు, 2014 సంవత్సరంలో ఎన్నికల సమయంలో కోడంగల్ కు ట్రైన్ సౌకర్యం, సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఏ ఒక్కరోజు దాని కోసం ప్రయత్నం చేయలేదన్నారు, కోడంగల్ అభివృద్ధి కోసం ఏ ఒక్క మంత్రిని కూడా రేవంత్ రెడ్డి కలిసిన పాపాన పోలేదన్నారు, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి తో పాటు వార్డు మెంబర్ కానటువంటి వారు కూడా తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సలీం, బాల్ సింగ్, మేకల రాజేష్, కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ కటకం శివకుమార్, టిటి రాములు నాయక్, ఓం ప్రకాష్, సయ్యద్ అంజాద్, పకీరప్ప, సిద్ధి లింగప్ప తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Jan,2021 07:26PM