నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను అమలు చేయడం హర్షణీయమని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పెద్ద మల్లారెడ్డి గ్రామ పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు సతీష్ రెడ్డి అన్నారు. ఓసిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఎంతో మేలు, న్యాయం జరుగుతుందన్నారు. రిజర్వేషన్ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కొండల్ రెడ్డి, బాలాజీ ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Jan,2021 08:07AM