నవతెలంగాణ డిచ్ పల్లి
పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 బీబీ పూర్ తాండ వద్ద బుధవారం రోడ్డు దాటుతున్న ఒక మహిళను కామారెడ్డి వైపు నుండి వేగంగా వచ్చిన ఒక కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలంలోని చందూరు గ్రామానికి చెందిన సపాయి శాంతాబాయి 68 గత కొన్ని రోజుల క్రితం మండలంలోని బీబీ పూర్ తాండ కు వచ్చి జాతీయ రహదారి పక్కనే ఉన్న బస్టాండ్ లో భార్య భర్తలు కలిసి నివాసముండేవారని రోజువారీగా చిత్తు కాగితాలు ఏరుకుని రోజులు గడిపి ఉండేవారని దానిలో భాగంగానే రహదారి దాటుతుండగా కామారెడ్డి వైపు నుండి నిజాంబాద్ కు వెళుతున్న ఒక బొలెరో వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రం తరలించినట్లు వారు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Feb,2021 07:44PM