నవతెలంగాణ కంటేశ్వర్డాక్టర్ వనం అఖిలేశ్ మరణం నిజామాబాద్ వైద్యరంగానికే కాక సమాజసేవ రంగానికి తీరని లోటు అని నిజమాబాద్ జిల్లా ప్రముఖులు అన్నారు. ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, కుటుంబ సమేతంగా ప్రజల సేవలో నిరంతరం ఉండేవారు, మంచి వైద్యుని గా పేరు తెచ్చుకున్నారని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. వారికి అకాల మరణం అత్యంత బాధాకరమని అతి చిన్న వయసులోనే మంచి డాక్టర్ గా ఉన్నత భావాలు కలిగిన వ్యక్తిత్వం మూర్తీభవించిన వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారని కోనియాడారు. వారి మరణం పట్ల హరిత రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, కేర్ విద్యా సంస్థలు తీవ్ర సంతాపాన్ని తెలుపుతున్నాయని నరాల సుధాకర్, ఘనపురం దేవేందర్ బుధవారం తెలిపారు .
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 24 Feb,2021 09:46PM