నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని ర్యాగట్ల పల్లి గ్రామంలో బుధవారం సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ మంతురి గంగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో గ్రామంలో 10 లక్షల రూపయ ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో సి సి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధికి ఎంతగానో సహాకరిస్తున్న ఎమ్మెల్యేకు గ్రామస్థుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనసూయ, వార్డు సభ్యులు రూప, రమేష్, పద్మ, మైపాల్ రెడ్డి, తిరుమల్ రెడ్డి, అనిత, అమృత, సమన్వయ సమితి సభ్యుడు మల్లారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, శ్యామల, రాజి రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Feb,2021 01:23PM