నవతెలంగాణ ధర్మసాగర్.
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని మాజీ ఉప ముఖ్యమంత్రి ,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు . ధర్మసాగర్ మండల కేంద్రంలో జిల్లాస్థాయి టోర్నమెంట్ గ్రామ సర్పంచి ఎర్రబెల్లి శరత్ ఉప సర్పంచ్ బొడ్డు అరుణ ఈమాన్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన క్రికెట్ టోర్నమెంట్ కు గురువారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారిని సహకారం కోరగా ,వారు సానుకూలంగా స్పందించి, టోర్నమెంట్స్ నిర్వహణకై అయ్యే ఆర్ధిక సహకారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందింప జేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి అని అన్నారు యువత క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని, ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ దేశ భవిష్యత్తు యువత పైన ఆధారపడి ఉందని, యువత కాలం వృధా చేసుకోకుండా, అన్ని రంగాలలో ముందుండి, సమయాలను సద్వినియోగం చేసుకుంటూ, మంచి జీవితాలను ఏర్పాటు చేసుకునేందుకు, నిరంతరం కృషి చేస్తూ ముందుకు సాగి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మసాగర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు గంగారపు ఆనందరావు,బొడ్డు ప్రదీప్,కొలిపాక మల్లికార్జున్ గారు,బొడ్డు ప్రభుదాస్, చిలుక విన్నూ,కడియం యువసేన మండల అధ్యక్షుడు అడిగొప్పుల ప్రవీణ్,కడియం యువసేన సభ్యులు చిలుక సుఖేందర్, ఎండి వసీం, మరియు టోర్ణమెంట్స్ నిర్వాకులు వెంగల పున్నంచందర్,ముజ్జు,భార్గవ్,రఘుపతి రెడ్డి,రాజేష్, ప్రభు,ప్రదీప్,చింటూ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Feb,2021 05:03PM