- మాల్లపుర్ సందర్శించిన డిపిఒ.= జయసుద
నవతెలంగాణ డిచ్ పల్లి
గ్రామం అన్ని రంగాల్లో బెస్ట్ గా నిలిచిందని, రాబోవు రోజుల్లో మరింత అభివృద్ధి పనులు చేపట్టడానికి పాలక వర్గం ఎప్పటికప్పుడు స్పందించడం అభినందన మని జిల్లా పంచాయతీ అధికారిని జయసుద అన్నారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని మాల్లపుర్ గ్రామాన్ని అకస్మికంగా సందర్శించారు.
గ్రామంలో పల్లె పకృతి వనం, వైకుంఠ దామంను, మాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ లో జరుగుతున్న పనులను, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను ఇతర వాటిని పరిశీలించారు.ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ మండలంలోని కనివిని ఎరుగని రీతిలోవైకుంఠదామం నిర్మాణం, పల్లె ప్రకృతి వనంను సుందరంగా తీర్చి దిద్దడం జరిగిందన్నారు.
గ్రామంలో ప్రజల అవసరాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని సర్పంచ్ లోలం సత్యనారాయణ వివరించారు గత కొన్ని ఏళ్లుగా పల్లె ప్రకృతి వనం మండలంలోని ఎ గ్రామంలో లేకుండా అన్ని హంగులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో చేస్తున్న పనుల నిర్వహణ బేశుగ్గ ఉందన్నారు.తయారుచేసిన ఎరువును ఒక రైతుకు 500 రూపాయలకు ఆమె చేతుల మీదుగా విక్రయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనుష , మాజీ ఉప సర్పంచ్ గంగాధర్ తోపాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు ,తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 25 Feb,2021 07:24PM