నవతెలంగాణ కంటేశ్వర్
ఫిబ్రవరి 28 ఆదివారం నాడు తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సాహిత్య వైభవ సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత వరికుప్పల యాదగిరి హాజరు అవుతున్నట్టు తెరసం జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్ఫ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఫిబ్రవరి 28 ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ సభలో నరాల సుధాకర్ రచించిన నేను 2 పుస్తక పరిచయం, ఇటీవల అవార్డులు అందుకున్న జిల్లా కవుల అభినందన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అధ్యక్షత వహించే ఈ సభకు ప్రధాన వక్తగా ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు తెలంగాణ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల శ్రీనివాస మూర్తి, గౌరవ అతిథులుగా ప్రముఖ కవి ఇందూరు తిరుమల ఆలయ ధర్మకర్త వి నర్సింహారెడ్డి, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి హాజరవుతారని ఆయన తెలిపారు. జిల్లాలోని రచయితలు సాహిత్య అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Feb,2021 01:21PM