- ఆదివాసి నాయక్ పోడు రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ చందర్..
నవతెలంగాణ నవీపేట్
ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఆదివాసి నాయక్ పోడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల రామ్ చందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షులు మేకల నర్సయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గాండ్ల రామ్ చందర్ హాజరై మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో గిరిజనులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని హామీ ఇచ్చిందని కానీ జిల్లాలో 40 వేల జనాభా ఉన్న ఏ ఒక్క కుల సభ్యుడికి ప్రయోజనం కలవలేదని అన్నారు. విద్య ఉపాధిఅవకాశాలు కూడా తూతూమంత్రంగా అందుతున్నాయని అన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించే ఉద్దేశంతో ప్రభుత్వం 2 కోట్లు కేటాయించగా తమ కులానికి మాత్రం ఐదు లక్షలు కేటాయించి తమను చిన్నచూపుగా చూసింది అని అన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే భీమన్న జాతర ప్రభుత్వం 50 లక్షలు కేటాయించాలని కోరారు. జనాభా తక్కువ అనే కారణంతో ఆపై చిన్న చూపు చూడకుండా అందరి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చెప్పుడు ప్రభుత్వంగా కాకుండా చేతల ప్రభుత్వంగా ఉండాలని అన్నారు. కులస్తులు అందరూ ఐక్యంగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధ్యక్షులు గడ్డం శంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సురేష్ రాజేందర్, పోగుల నరసయ్య, మెట్టు రమణ మరియు ఆయా గ్రామాల కులస్తులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Feb,2021 02:56PM