- హైదరాబాద్‌తో సహా 7 నగరాల్లో.. 40,000 ఉబర్ ఆటోల్లో సేఫ్టీ స్క్రీన్స్ ఏర్పాటు
- హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పుణె, జైపూర్‌లో సురక్షిత ప్రయాణం
- అమెజాన్ పే ద్వారా డబ్బులు చెల్లిస్తే.. రైడ్‌లో 50 శాతం క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు
హైదరాబాద్: 40,000 ఉబర్ ఆటోల్లో సేఫ్టీ స్క్రీన్ లను ఏర్పాటు చేసేందుకు ఉబర్ మరియు అమెజాన్ పే ఇవాళ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. ఇందుకోసం ఈ రెండు సంయుక్తంగా పనిచేస్తాయి. ఇవి డ్రైవర్ మరియు రైడర్ మధ్య సురక్షితంగా ఉంటాయి. వీటిని దేశంలోని 7 ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైద్రాబాద్, చెన్నై, పూణే మరియు జైపూర్ లోని ఉబర్ ఆటోల్లో ఏర్పాటు చేస్తున్నారు.
అక్టోబర్ 2020లో మొదటిసారిగా అమెజాన్ పే మరియు ఉబర్ రెండూ జతకలిశాయి. ఉబర్ రైడ్స్‌ని అమెజాన్ పేతో కట్టేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీనిద్వారా అమెజాన్ పే ఉపయోగించి కాంటాక్ట్ లెస్, క్యాష్ లెస్ పేమెంట్ లు చేసేందుకు వీలు కలిగింది. ఇప్పుడు ఈ భాగస్వామ్యంలో భాగంగా అమెజాన్ పే ద్వారా రైడర్‌లు ప్రతి రైడ్ కు 50% వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది.
ఈ భాగస్వామ్యం పైన చెప్పిన 7 మార్కెట్‌లలో ఉబర్ ఆటో యొక్క వృద్ధిని మరింత పెంచుతుంది. ఎందుకంటే రైడ్ లు మరింత సరసమైన ధరలకు అందుతాయి. అంతేకాకుండా ప్రయాణికులు తమ ఇంటి వద్ద నంచే ఆటోని బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ సందర్భంగా ఉబర్ ఇండియా మరియు దక్షిణాసియా అధ్యక్షుడు ప్రబ్‌జీత్ సింగ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. మా ఫ్లాట్ ఫారంపై విశ్వసనీయమైన, సురక్షితమైన మరియు అద్భుతమైన ప్రయాణాన్ని అందించడం కోసం అమెజాన్ పేతో భాగస్వామ్యాన్ని విస్తరించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. రైడర్ లు మరియు డ్రైవర్ లు ఇద్దరూ రైడ్ ల సమయంలో సురక్షితం అని ఫీలయ్యేలా ఉండేందుకు సేఫ్టీ స్క్రీన్ లు ఏర్పాటు చేయడం మరియు డిజిటల్ పేమెంట్ ఆప్షన్ లను ప్రారంభించడం తో సహా అన్ని జాగ్రత్తలను మేం కొనసాగిస్తున్నాం. ఈ అసోసియేషన్ భద్రత పట్ల మా అంకితభావాన్ని మరింత బలోపేతం చేస్తుంది మరియు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం కొనసాగించేలా ప్రజలను ప్రోత్సహిస్తుందని మేం విశ్వసిస్తున్నాం అని అన్నారు ఆయన. ఈ సందర్భంగా అమెజాన్ పే CEO మహేంద్ర నేరుర్కర్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. రోజువారీ అవసరాలు, పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ సురక్షితమైన చెల్లింపుల విధానాన్ని వినియోగదారులకు అందించాలి. అందుకు తగ్గట్లుగా గతేడాది నుంచి కాంటాక్ట్ లెస్ చెల్లింపులు ప్రవేశపెట్టాం. అందులో ఇప్పుడు మేము ఎన్నో రెట్లు వృద్ధిని చూశాం. మా కస్టమర్ లకు ఏమి కావాలా, ఎలా కావాలో అందించడం కోసం మా భాగస్వామ్యాలను ఆవిష్కరించడం, సరళీకరించడం మరియు బలోపేతం చేయడానికి ఇది మాకు అవకాశం కల్పిస్తుంది. మరింత మంది భారతీయులు తమ రోజువారీ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడంతో, వారి అనుభవాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా మరియు ప్రతిఫలాన్ని పొందడానికి మేం కట్టుబడి ఉన్నాం అని అన్నారు ఆయన.
అమెజాన్ పే అనేది డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఒక నమ్మకమైన మార్గం. అంతేకాకుండా వినియోగదారులు నగదుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మరియు సౌకర్యవంతంగా లావాదేవీలు జరపడానికి అమెజాన్ పే దోహదపడుతుంది. విద్యుత్, నీరు మరియు గ్యాస్ బిల్లు చెల్లింపులు, డిటిహెచ్ మరియు మొబైల్ రీఛార్జ్ వంటి వివిధ రకాలైన పేమెంట్స్‌ని చేసుకోవచ్చు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 26 Feb,2021 03:09PM